బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెట్టి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంపద, ఐశ్వర్యం వస్తాయంటూ మూఢనమ్మకాలను నమ్మించిన కొందరు వ్యక్తులు బాలికను పలుమార్లు చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వైఎస్సార్ కడప జిల్లాలో నమోదైన కేసు అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు బదిలీ అయింది.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం కుటుంబంతో నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో వారికి మహాలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. హోటల్ వ్యాపారం ద్వారా పెద్దగా లాభాలు రావని, త్వరగా సంపన్నులు కావడానికి ఓ పూజ చేయాలని ఆమె నమ్మబలికినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలికను వివస్త్రను చేసి పూజలో కూర్చోబెడితే డబ్బు, ఐశ్వర్యం వస్తాయని చెప్పడంతో తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
తర్వాత ఆమె మాటలకు నమ్మి అంగీకరించినట్లు సమాచారం. హేమంత్ అనే వ్యక్తిని పూజ కోసం పిలిపించగా.. అతడు బాలికను ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి వివస్త్రను చేసి, అసభ్యకరంగా తాకుతూ పూజలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పూజ ఫలించలేదని, మరోసారి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.
సుమారు ఆరు నెలల తర్వాత ఆగస్టు 8న హేమంత్‌తోపాటు అతని కుమారుడు బాలసుబ్రహ్మణ్యం, విజయ్‌కుమార్ బాలిక వద్దకు వచ్చినట్లు సమాచారం. మళ్లీ బాలికను అదే విధంగా పూజలో కూర్చోబెట్టి వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసారి కూడా పూజ సరిగా జరగలేదని చెప్పినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 9న బాలికను, ఆమె తల్లిని నిందితులు కడపకు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ వెంకటేశ్‌యాదవ్ అనే వ్యక్తి మరోసారి పూజ పేరుతో బాలికను చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం తల్లీకుమార్తెలను భాగ్యలక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉంచినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 11న మళ్లీ పూజ చేయాలంటూ బాలికను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లేందుకు నిందితులు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు విషయం తెలిసిందని గుర్తించిన నిందితులు తల్లీకుమార్తెలను కారులో నుంచి దింపేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై బాధితులు వల్లూరు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం కేసును అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు బదిలీ చేశారు. మహాలక్ష్మి, హేమంత్, బాలసుబ్రహ్మణ్యం, వెంకటేశ్‌యాదవ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















