వైకాపా అధినేత జగన్‌కు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎల్‌నినో పరిస్థితులపై చర్చలో ఎందుకు పాల్గొనలేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని విమర్శించారు. విపత్తులు, సంక్షోభాలను ముందుగానే అంచనా వేసి సమర్థంగా ఎదుర్కొనే విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు.
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రవీంద్ర మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అతివృష్టి, అనావృష్టి, తుపానుల కారణంగా రైతాంగానికి సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినా.. కేవలం రూ.1,600 కోట్లు విదిల్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. రైతులపై నిజమైన శ్రద్ధ ఉంటే నాటి ప్రభుత్వ వైఫల్యాలపై కూడా జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
2023లో 54 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నా అప్పటి వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని రవీంద్ర ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా పట్టిసీమ ప్రాజెక్టు పంపులను కాటాకు వేయాలంటూ జగన్ అవహేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపుతో నీటి వనరులను వినియోగించుకుంటోందని పేర్కొన్నారు.
వైకాపా హయాంలో బీసీలకు అన్యాయం జరిగినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. ‘‘300 మంది బీసీలను ఊచకోత కోసినప్పుడు, రూ.లక్ష కోట్ల బీసీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించినప్పుడు, వారి భూములను లాక్కున్నప్పుడు.. అప్పుడు బీసీలపై ప్రేమ ఎక్కడుంది?’’ అని నిలదీశారు. అప్పట్లో మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను వైవీ సుబ్బారెడ్డి కాళ్ల దగ్గర కూర్చోబెట్టినప్పుడు జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
మద్యం రవాణాలో వందల కోట్లు దోచుకున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసిన తర్వాతే బీసీలు గుర్తుకొచ్చారా అని రవీంద్ర మండిపడ్డారు. చట్టపరమైన చర్యలను రాజకీయ రంగు పులమడం సరికాదని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















