మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల కుమార్తెను నడుముకు కట్టుకొని ఓ తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో తల్లితో పాటు చిన్నారి కూడా మృతి చెందింది.
స్థానికుల వివరాల ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్ల గ్రామానికి చెందిన మెరుగు అంజయ్యతో సుమారు ఏడేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు కుమార్తె అక్షిత (6), కుమారుడు మహేందర్ (18 నెలలు) ఉన్నారు.
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో రజిత తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. అంజయ్య అప్పుడప్పుడు లింగాపూర్‌కు వచ్చి పిల్లలను చూసుకొని వెళ్తుండేవారని కుటుంబీకులు తెలిపారు.
ఆదివారం ఉదయం రజిత తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఎప్పటిలాగే అంజయ్య గ్రామానికి వచ్చి పిల్లలను చూసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే రజిత తన కుమారుడు మహేందర్‌ను ఇంట్లో పడుకోబెట్టి, కుమార్తె అక్షితను వెంట తీసుకొని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అనంతరం కుమార్తెను నడుముకు కట్టుకొని రజిత బావిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటుగా వెళ్తున్న స్థానికులకు బావిలో మృతదేహాలు తేలియాడుతూ కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. రజిత ఈ దారుణ నిర్ణయం తీసుకోవడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలే కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై ఎస్ఐ రాజ్‌వర్ధన్‌ను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















