ఇంట్లో రోజూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పెద్ద పరిష్కారాలే అవసరం లేదు. కొంచెం ఆలోచన, కాస్త టెక్నాలజీ ఉంటే చాలు.. పనులు చాలా సులభంగా మారిపోతాయి. ముఖ్యంగా తక్కువ స్థలం ఉన్న ఇళ్లలో, పిల్లలు ఉన్న కుటుంబాల్లో, తరచూ ప్రయాణాలు చేసేవారికి కొన్ని చిట్టి గ్యాడ్జెట్లు ఎంతో ఉపయోగపడతాయి.
పిల్లలకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయడం నుంచి, వానాకాలంలో బట్టలు ఆరబెట్టడం వరకు.. ప్రయాణాల్లో వేడి నీరు అందుబాటులో ఉంచుకోవడం వరకు విభిన్న అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌లో ఎన్నో చిన్న పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రోజువారీ జీవితంలో నిజంగానే ఉపయోగపడేలా రూపొందించారు.
ముఖ్యంగా రిట్రాక్టబుల్ క్లాత్స్‌లైన్ చిన్న ఇళ్లకు మంచి ఎంపిక. గోడకు అమర్చుకుని అవసరమైనప్పుడు మాత్రమే లైన్లను బయటకు తీసి బట్టలు ఆరేసుకోవచ్చు. పని పూర్తయిన తర్వాత మళ్లీ లోపలికి పంపేయడంతో స్థలమూ ఆదా అవుతుంది.
అలాగే మడతపెట్టే ఎలక్ట్రిక్ కెటిల్ ప్రయాణాలు చేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ స్థలంలో సర్దుకోవడంతో పాటు వేడి నీటితో టీ, కాఫీ, సూప్, ఓట్స్ వంటి వాటిని సిద్ధం చేసుకోవచ్చు. ఆటోమేటిక్ పవర్ ఆఫ్, డ్రై బాయిల్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలు ఉండటం అదనపు ప్రయోజనం.
ఇక పిల్లలను ఆకట్టుకునే క్యూట్ సోప్ డిస్పెన్సర్లు చేతులు కడుక్కోవడాన్ని సరదాగా మార్చే ప్రయత్నం. నత్త వంటి బొమ్మల ఆకారాల్లో ఉండటంతో పిల్లలు ఆసక్తిగా సబ్బు తీసుకుని చేతులు శుభ్రం చేసుకునేలా ప్రోత్సహించవచ్చు.
మొత్తానికి.. ఇంటి పరిమాణం ఎంత ఉన్నా, అవసరానికి తగ్గట్టు ఎంచుకున్న చిన్న గ్యాడ్జెట్లు రోజువారీ పనుల్లో సమయాన్ని, స్థలాన్ని ఆదా చేయడంలో ఉపయోగపడతాయి. ధర కూడా అందుబాటులోనే ఉండటంతో పెద్దగా ఖర్చు చేయకుండానే ఇంటి పనులను కాస్త స్మార్ట్‌గా మార్చుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















