శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది.
ఎస్సై సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టపర్తి నుంచి ముగ్గురు యువకులు ఆదివారం రాత్రి సుమారు 7.30 గంటలకు ద్విచక్ర వాహనంపై కదిరి వైపు బయలుదేరారు. అరవవాండ్లపల్లి వద్దకు చేరుకునే సమయంలో ద్విచక్ర వాహనం వేగాన్ని నియంత్రించలేకపోయారు. దీంతో రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టారు.
ప్రమాద తీవ్రతకు ద్విచక్ర వాహనం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పుట్టపర్తికి చెందిన అనిల్ (25), కొత్తచెరువుకు చెందిన అర్జున్ (25), గోరంట్లకు చెందిన దీక్షిత్ (25) అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మృతుల్లో అనిల్, అర్జున్ పాల ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. దీక్షిత్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పాల ఆటోలు నడుపుతూ కుటుంబాలను పోషిస్తున్న ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదానికి అతివేగమే కారణమా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















