అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఓ శకం ముగిసింది. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఆడబోనని ప్రకటించాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన అద్భుత ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన మెస్సీ.. భావోద్వేగ సందేశంతో ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు.
‘‘ఈ నిర్ణయం ఎంతో బాధిస్తుంది. అయితే రిటైర్ కావాల్సిన సమయం వచ్చేసింది. నేను ఎప్పుడు మైదానంలోకి దిగినా నా శక్తినంతా ధారపోశాను. అర్జెంటీనా జెర్సీ కోసం ఎంతో పోరాడాను. అభిమానులకు ఆనందాన్ని అందించడం, అర్జెంటీనా పౌరులుగా మీరు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం’’ అని 39 ఏళ్ల మెస్సీ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.
తాను జూన్ 21నే రిటైర్మెంట్ లేఖను సిద్ధం చేసుకున్నానని, అయితే తన తండ్రి జోర్జ్ అనారోగ్యం కారణంగా దాన్ని వెంటనే వెల్లడించలేకపోయానని మెస్సీ తెలిపాడు. జోర్జ్ ఆగస్టు 8న కన్నుమూశారు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ మెస్సీ కృతజ్ఞతలు తెలిపాడు.
మెస్సీ 2006లో అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండు దశాబ్దాల కెరీర్‌లో 207 మ్యాచ్‌లు ఆడి 125 గోల్స్ సాధించాడు. 2006లో క్రొయేషియాపై తొలి అంతర్జాతీయ గోల్ నమోదు చేశాడు. 2026 ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌పై సాధించిన గోల్ అతడి చివరి అంతర్జాతీయ గోల్‌గా నిలిచింది.
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తర్వాత మెస్సీ రెండో స్థానంలో ఉన్నాడు. రొనాల్డో 233 మ్యాచ్‌ల్లో 146 గోల్స్ సాధించగా.. మెస్సీ 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్ చేశాడు.
మెస్సీ అర్జెంటీనా జట్టుకు 2022 ప్రపంచకప్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు గోల్స్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న అతడు.. ప్రపంచకప్ చరిత్రలో మొత్తం 21 గోల్స్ సాధించాడు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ మెస్సీ క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం మేజర్ లీగ్ సాకర్ క్లబ్ ఇంటర్ మయామికి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
అంతర్జాతీయ కెరీర్‌కు మెస్సీ వీడ్కోలు పలకడం ఇదే తొలిసారి కాదు. 2016 కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి అనంతరం అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ నిర్ణయాన్ని ఎక్కువ కాలం కొనసాగించకుండా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈసారి మాత్రం అర్జెంటీనా జెర్సీకి శాశ్వతంగా వీడ్కోలు పలికినట్లు ప్రకటించాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















