వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు ఎంతో కీలకమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలందించడంతో పాటు ఆరోగ్యం, దివ్యాంగుల సంక్షేమం, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు వంటి కార్యక్రమాల్లో రెడ్‌క్రాస్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.
సంకల్ప ఫౌండేషన్ సహకారంతో తలసీమియా బాధితులకు ఆరోగ్య సేవలు అందించడం, రోటరీ ఇంటర్నేషనల్‌తో కలిసి దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించడం, ఎల్.వి.ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో కార్నియా సేకరణ వంటి కార్యక్రమాలు సామాజిక బాధ్యతకు నిదర్శనమని గవర్నర్ అన్నారు. ఈగల్ టీమ్‌తో కలిసి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం కూడా అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ సహకారంతో రూ.8.50 కోట్ల బడ్జెట్‌తో అమలు చేస్తున్న ‘మీ ఇంటికి డాక్టర్’ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో ఐదు లక్షల కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు మరింత చేరువ కావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న పలువురు జిల్లా కలెక్టర్లను కార్యక్రమంలో గవర్నర్ సత్కరించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా, కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌లకు బంగారు పతకాలు, అవార్డులు అందజేశారు.
కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖ జనరల్ సెక్రటరీ అశ్వనీకుమార్ పరిడా, ఛైర్మన్ వై.డి.రామారావు, వైస్ ఛైర్మన్ రామచంద్రరాజు, కోశాధికారి శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















