తన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలిపారు. దిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆమె తనపై వస్తున్న ఆరోపణలు, పార్టీ అధిష్ఠానంతో జరిగిన చర్చలపై స్పందించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు కొండా సురేఖ వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మాత్రం ఇంకా మాట్లాడలేదన్నారు. తనను రాజీనామా చేయాలని ఇప్పటివరకు అధిష్ఠానం కోరలేదని స్పష్టం చేశారు.
తన విషయంలో ఒక రకంగా, ఇతర సామాజిక వర్గాలకు మరో రకంగా న్యాయం చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. ‘‘బీసీనైన నాకు ఒక న్యాయం.. ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా?’’ అని వ్యాఖ్యానించారు. క్యాబినెట్‌లో ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన నేతలపైనా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయని, వాటిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఆ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలని కొండా సురేఖ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని వ్యవహారాలపై ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అధిష్ఠానంలోని ముఖ్య నేతలకు రాతపూర్వకంగా తెలియజేసినట్లు తెలిపారు.
తాజాగా ఖర్గేను కలిసిన సందర్భంగా కూడా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు మంత్రి వెల్లడించారు. తన విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















