ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవోగా విశ్రాంత ఎయిర్‌మార్షల్ జితేంద్ర మిశ్ర ఎంపికయ్యారు. భారత వాయుసేనలో సుదీర్ఘంగా సేవలందించిన ఆయనకు ఇప్పుడు రామాలయ నిర్వహణలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.
జితేంద్ర మిశ్ర దాదాపు 39 ఏళ్లపాటు వాయుసేనలో సేవలందించారు. ఆయన అనుభవం, పరిపాలనా సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకున్న ఎంపిక కమిటీ రామాలయ సీఈవో పదవికి ఆయన పేరును ఖరారు చేసినట్లు సమాచారం.
సీఈవో ఎంపిక ప్రక్రియలో భాగంగా భారీ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 5,585 దరఖాస్తులను ఎంపిక కమిటీ పరిశీలించింది. వాటిలో 16 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేసింది. అనంతరం ముగ్గురితో కూడిన తుది జాబితాను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు సమర్పించింది. ఈ ప్రక్రియ అనంతరం జితేంద్ర మిశ్రను తొలి సీఈవోగా ఎంపిక చేశారు.
అయోధ్య రామాలయానికి భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ నిర్వహణ, పరిపాలన, వివిధ విభాగాల సమన్వయం వంటి అంశాల్లో సీఈవో కీలక పాత్ర పోషించనున్నారు. ఆలయ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. అయోధ్య రామాలయంలో కానుకలు, విరాళాల చోరీకి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో సీఈవో నియామకం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలయ నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధమైన పరిపాలనపై దృష్టి సారించేందుకు ఈ నియామకం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















