తెలంగాణలో దళితులు, మహిళల భద్రత, ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా భారాస నేతలు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారు. శాసనసభ ప్రాంగణంలో, వెలుపల చోటుచేసుకున్న ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
ఈ నెల 8న అసెంబ్లీ ఎదుట జరిగిన ఆందోళన, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించిన కాంగ్రెస్ నేతలు.. భారాస ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. స్పీకర్ తల్లిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించడం ద్వారా దళిత సమాజాన్ని, మహిళలను అవమానించారని ఆరోపించారు.
అదేవిధంగా శాసనసభ ప్రధాన ద్వారం వద్ద భారాస నేతలు వ్యవహరించిన తీరుపైనా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా కెమెరాల సమక్షంలో చొక్కాలు విప్పి పోలీసులపై విసరడం, విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది వైపు దూసుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేటీఆర్ నేతృత్వంలో కొందరు భారాస నాయకులు మహిళా పోలీసు అధికారులపై భౌతిక దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
మరోవైపు ఎర్రవల్లి వైపు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లిన దళితులను భారాస నేతలు అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. దళితులు నడిచిన రహదారులపై పసుపు నీరు, పాలు చల్లి శుద్ధి చేయడం అంటరానితన భావజాలాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం మరింత ఆందోళనకరమని పేర్కొంది.
దళితులు, మహిళల గౌరవం, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారితోపాటు వాటి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్న భారాస అగ్రనాయకత్వంపై కూడా సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















