అల్పపీడన ప్రభావంతో విజయవాడలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా.. కొద్దిసేపటికే ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. భారీగా వర్షపు నీరు రహదారులపై చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రధాన రహదారులు, కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు వర్షంలో తడిసి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి.
ఇదిలా ఉండగా.. వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కిలోమీటర్లు, దక్షిణ కోస్తా తీరంలో 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















