తెలంగాణ గడ్డకు అన్యాయాన్ని ఎదిరించే పోరాట చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తరతరాలుగా కొనసాగిన అణచివేత, దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నేల నుంచి ధిక్కార స్వరం వినిపించిందని పేర్కొన్నారు. ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నివాళులర్పించారు.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. సమ్మక్క-సారలమ్మ పోరాటం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించే చైతన్యం కొనసాగిందన్నారు. తెలంగాణ సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.
నిజాం పాలనలో హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతలు కొనసాగాయని రేవంత్‌రెడ్డి వివరించారు. చివరి దశలో రజాకారుల దౌర్జన్యాలు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజల ఆకాంక్షల నేపథ్యంలో నెహ్రూ, పటేల్ నాయకత్వంలో సైనిక చర్య చేపట్టగా, ఆపరేషన్ పోలో అనంతరం ఏడో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయారని తెలిపారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగంగా మారడం ద్వారా రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం ఏర్పడిందని సీఎం అన్నారు. ప్రస్తుతం ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రజాపాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి చేరుకుంటోందని రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలుగా ఉందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 91 శాతం అధికమని వివరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తున్నామని, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















