వీధికుక్కల బెడదపై అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు యువసేన కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర పంచాయతీ కార్యాలయంలోకి రెండు వీధికుక్కలను సంచుల్లో తీసుకొచ్చి.. ప్రధానాధికారి బల్లపై వదిలేశారు. దీంతో కార్యాలయంలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
నిఫాడ్ ప్రాంతంలో వీధికుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని యువసేన కార్యకర్తలు ఆరోపించారు. చిన్నారులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు కుక్కల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే పలువురిపై వీధికుక్కలు దాడి చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యపై గత ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్యకర్తలు ఆరోపించారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులకు ప్రత్యక్షంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే శునకాలను కార్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
సమస్య పరిష్కారానికి అధికారులు ఎనిమిది రోజుల గడువు కోరారని యువసేన కార్యకర్తలు చెప్పారు. ఆ గడువులోగా చర్యలు తీసుకోకపోతే మరోసారి శునకాలను కార్యాలయానికి తీసుకొస్తామని హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















