రాజస్థాన్ ఆదివాసీ మహా సమితి వ్యవస్థాపక దినోత్సవ ముగింపు కార్యక్రమంలో గిరిజన సమాజం పలు సామాజిక సంస్కరణ తీర్మానాలు చేసింది. డూంగర్‌పుర్ జిల్లా సరోదాలో జరిగిన ఈ భారీ సమావేశానికి రాజస్థాన్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది గిరిజనులు, సాధువులు, ఆధ్యాత్మిక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కీలక తీర్మానం చేశారు. చిన్న వయసులో ఫోన్ల వాడకం వల్ల విద్యపై ప్రభావం పడుతోందని వారు అభిప్రాయపడ్డారు.అదేవిధంగా తక్కువ వయసు పిల్లలకు బైకులు ఇవ్వడం, లైసెన్సు లేకుండా డ్రైవింగ్, యువత బైక్ రేసులు వంటి వాటిపై కూడా ఆంక్షలు విధించాలని నిర్ణయించారు.
పెళ్లిళ్లలో ఆడంబరాలు తగ్గించేందుకు బంగారం బదులు వెండి నగలతోనే వివాహాలు చేయాలని తీర్మానించారు. పెళ్లి వేడుకల్లో అధిక ఖర్చులు, డీజేలు పూర్తిగా వద్దని కూడా నిర్ణయించారు.మద్య నిషేధాన్ని తమ సమాజంలో పూర్తిగా అమలు చేయాలని గిరిజనులు ప్రతిజ్ఞ చేశారు. యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని నేతలు తెలిపారు.అంతేకాకుండా చదువులో, క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించి ప్రోత్సహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















