రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, వివిధ కీలక ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చర్చించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
భేటీ అనంతరం జేపీ నడ్డా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రారంభించారు. అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
అదేవిధంగా రాష్ట్రంలోని 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను కేంద్ర మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ప్రభుత్వ వైద్య వ్యవస్థలో కీలకమైన మౌలిక సదుపాయాలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, అత్యవసర చికిత్సను వేగంగా అందించేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడనున్నాయి.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆరోగ్య రంగంలో మరిన్ని మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నేతలు ప్రస్తావించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















