ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుగా వస్తోందన్న కారణంతో కుమార్తె.. తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటలో ఈపూరు లక్ష్మి నివాసముంటున్నారు. ఆమె కుమార్తె పుష్పలతకు రాజా అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తల్లీకూతుళ్ల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో పుష్పలత తన ప్రియుడు రాజాతో కలిసి లక్ష్మిపై దాడి చేసి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె, ఆమె ప్రియుడి పాత్రపై విచారణ కొనసాగుతోంది. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















