విశాఖపట్నం వేదికగా వచ్చే నెల 9న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) ప్రారంభం కానుందని ఆంధ్రా క్రికెట్ సంఘం (ACA) అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం తెలిపారు. ఈ సీజన్ ముగింపు పోటీలు మరియు వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
గత నాలుగు సీజన్లు విశాఖలోనే నిర్వహించగా, ఈసారి ఐదో సీజన్‌ను విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా నిర్వహించాలని ACA మరియు APL గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలిపారు. డే అండ్ నైట్ మ్యాచ్‌లతో ఈ టోర్నీ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది.
మొత్తం 32 మ్యాచ్‌లు మూడు వేదికల్లో జరగనున్నాయి. వచ్చే నెల 9 నుంచి 14 వరకు విశాఖలో 11 మ్యాచ్‌లు, 17 నుంచి 21 వరకు కడపలో 9 మ్యాచ్‌లు, 24 నుంచి 30 వరకు మంగళగిరిలో 12 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈసారి అన్ని మ్యాచ్‌లకు జియో హాట్‌స్టార్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అందించనున్నట్లు ACA కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. దీంతో క్రికెట్ అభిమానులు ఎక్కడి నుంచైనా మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















