పుట్టిన రోజు వచ్చిందంటే చాలు పిల్లలు తల్లిదండ్రుల నుంచి బహుమతుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘ఆల్ఫా’ సినిమాలో మాత్రం ఒక ప్రత్యేకమైన మలుపు కనిపిస్తోంది. ఇక్కడ ఓ తండ్రి తన కుమార్తెకు 18వ పుట్టినరోజు కానుకగా ఓ రహస్య మిషన్‌ను అప్పగిస్తాడు. ఆ మిషన్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చే ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతుంది.
ఈ ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న ‘ఆల్ఫా’ చిత్రంలో బాలీవుడ్ కథానాయిక అలియా భట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు బాబీ దేఒల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. టీజర్‌లో అలియా భట్, బాబీ దేఒల్ తండ్రీ–కూతుళ్లుగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీజర్‌లో వినిపించే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులే ఉంటారు – ఒకటి తోడేలు, మరొకటి గొర్రె. నేను తోడేలు.. మరి నువ్వు ఎవరు?” అని బాబీ దేఒల్ అడగగా, “తోడేలు కూతురు తోడేలే అవుతుంది” అని అలియా భట్ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెల 3న థియేటర్లలో విడుదల కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















