ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) ప్రతిపాదించిన కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం రూ.2,533.99 కోట్ల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ నిధుల్లో రూ.1,299.08 కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించనుండగా, రూ.1,234.91 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆధునిక నివాస సముదాయాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ పూర్తయిన తర్వాత అమరావతి కేంద్రంగా పనిచేసే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే సీఆర్‌డీఏ ఈ ప్రాజెక్టు కోసం 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెంట్రల్ సెక్రటేరియట్ భవనం, మిగిలిన 17 ఎకరాల్లో ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల నివాస సముదాయాలు నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టు అమలుతో అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగవంతం కావడంతో పాటు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణ ప్రక్రియలో ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















