విజయవాడ – డ్రగ్స్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మంగళవారం ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
“జీవితాన్ని ప్రేమించు – డ్రగ్స్‌కు దూరంగా ఉండు” అనే నినాదంతో బీఆర్‌టీఎస్ రోడ్డులోని శారదా జంక్షన్ వద్ద సైకిళ్లు, ఆటోలతో అవగాహన ర్యాలీ చేపట్టారు.
కార్యక్రమంలో భాగంగా “డ్రగ్స్ వద్దు.. యోగా ముద్దు” అనే సందేశంతో యోగా సాధన నిర్వహించి, ఆరోగ్యకర జీవన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. డ్రగ్స్ దుష్ప్రభావాలు, యువత భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి పాల్గొన్నవారికి వివరించారు.
ఈ ర్యాలీలో పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఐపీఎస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సైకిల్ తొక్కుతూ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలంటే క్రీడలు, యోగా, ఆరోగ్యకర అలవాట్లను ప్రోత్సహించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















