ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు మొత్తం మూడు గంటల 15 నిమిషాల పాటు పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6,22,074 మంది కాగా, ప్రైవేటు అభ్యర్థులు 18,842 మంది ఉన్నారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే వారిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.
పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 210 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు.
అలాగే పరీక్షా నిర్వహణ కోసం 33,882 మంది ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా 7,429 మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను కూడా ఇన్విజిలేటర్లుగా నియమించడం గమనార్హం.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు వెళ్లే సౌకర్యం కల్పించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులను ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు.
అలాగే పరీక్ష ప్రారంభానికి ముందు విద్యార్థులు తమ ఓఎమ్మార్ షీట్‌పై ఉన్న ఫొటో, పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌ను తప్పకుండా సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు మొదటగా 24 పేజీల జవాబు పుస్తకం ఇస్తారు. అది పూర్తయితే అవసరమైతే అదనంగా 12 పేజీల బుక్‌లెట్ కూడా అందజేస్తారు.
పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు హాజరై ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















