ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేగం పుంజుకున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద రూ.200 కోట్ల నిధులు కేటాయించింది.ప్రతి ప్రాంతంలో ఏరోడ్రోమ్, ఫ్లోటింగ్ జెట్టీ, టెర్మినల్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.20 కోట్ల చొప్పున నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలు చేయనున్నారు.
గతేడాది విజయవాడ బెర్మ్ పార్క్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహించిన సీ ప్లేన్ ట్రయల్ రన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రయాణించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈ సేవలను విస్తరించాలని అధికారులకు సూచించారు.ప్రస్తుతం విజయవాడ, శ్రీశైలం, తిరుపతి, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకు, లంబసింగి, పోలవరం ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
సీ ప్లేన్లు నదులు, జలాశయాలు, సముద్ర తీర ప్రాంతాల్లో నీటి మీదే టేకాఫ్, ల్యాండింగ్ చేయగల ప్రత్యేక విమానాలు. పర్యాటకులను ఆకర్షించేందుకు నీటి మీద తేలియాడే జెట్టీలు, చిన్న టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నారు.ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) విధానంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రెండు ప్రైవేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















