దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థ Apollo Hospitals Enterprise Limitedకు ఈ ఏడాది ఎకనమిక్ టైమ్స్ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ‘ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్–మెగా’ పురస్కారాన్ని సంస్థ అందుకుంది. వ్యాపార వృద్ధితో పాటు సుస్థిర కార్పొరేట్ పాలన, తరతరాల వారసత్వాన్ని సమర్థంగా కొనసాగిస్తున్నందుకు ఈ అవార్డు లభించినట్లు అపోలో హాస్పిటల్స్ తెలిపింది.
సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి దూరదృష్టితో ప్రారంభమైన అపోలో ప్రస్థానం.. ప్రస్తుతం ప్రీతా రెడ్డి, శోభనా కామినేని, సునీతా రెడ్డి, సంగీతా రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా కొనసాగుతోంది. సంస్థలోని కీలక విభాగాలకు కుటుంబ సభ్యులు ప్రత్యేక బాధ్యతలు నిర్వహిస్తూ అపోలోను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొంది.
ప్రపంచస్థాయి ఆరోగ్య సేవలను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న తన కలను కుమార్తెలు ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌ను సమర్థంగా నడిపిస్తున్న కుటుంబ నాయకత్వానికి ఈ అవార్డు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















