అమెరికా–ఇరాన్ ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) తిరిగి తెరుచుకోవడంతో అరబ్ దేశాలు చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ తన కొనుగోలుదారులకు కీలక ప్రకటన చేసింది.
పర్షియన్ గల్ఫ్‌లోని దాస్, జిర్కు దీవుల వద్ద ఉన్న తమ ఓడరేవుల నుంచి ముడి చమురు లోడింగ్‌ను తిరిగి ప్రారంభించాలని కంపెనీ పిలుపునిచ్చింది. ఏప్రిల్ 27 నుంచి నిల్వలో ఉన్న చమురు అందుబాటులో ఉందని యూఏఈ (UAE) స్పష్టం చేసింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం కారణంగా హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
కొనుగోలుదారులు స్వంత ట్యాంకర్లు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో, తమ అనుబంధ నౌకల ద్వారా సహాయం అందిస్తామని కూడా యూఏఈ ప్రకటించింది. భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల్లో రష్యాతో పాటు యూఏఈ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల భారత్ నెలకు సగటున రోజుకు 6.2 లక్షల బ్యారెళ్ల చమురు ఈ దేశం నుంచి దిగుమతి చేసుకుంది.
ఇటీవలి ఉద్రిక్తతల కారణంగా యూఏఈ ఒపెక్ (OPEC) నుంచి వైదొలిగినట్లు కూడా సమాచారం. ఉత్పత్తిని పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌కు కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా–ఇరాన్ ఒప్పందం తర్వాత గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన రవాణా మళ్లీ ప్రారంభమైంది. మూడు నెలలకు పైగా నిరీక్షణ తర్వాత “దిశా (Disha)” అనే ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ గుజరాత్‌లోని దహేజ్ పోర్టుకు చేరుకుంది. ఖతార్‌లోని రాస్ లఫాన్ నుంచి ఎల్‌ఎన్‌జీ లోడ్ చేసిన ఈ నౌక, ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయింది.
శాంతి ఒప్పందం అనంతరం అమెరికా–ఇరాన్‌లు సంతకం చేసిన ఎంవోయూ తర్వాత భారత్‌కు చేరిన తొలి ఎల్‌ఎన్‌జీ నౌక ఇదేనని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















