ప్రఖ్యాత జ్యోతిషుడు కమలాకర్ భట్ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. కర్ణాటకలోని సిద్ధాపుర ఠాణా పోలీసులు మంగళవారం ఆయనను అరెస్టు చేశారు. కమలాకర్ భట్ తన అనుచరులతో కలిసి చేసిన దాడిలో వసంత్ నాయక్ (41) అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
పోలీసుల దర్యాప్తు ప్రకారం, అవరగుప్పె గ్రామానికి చెందిన సుచిత్ర అనే వివాహితతో కమలాకర్ భట్ సన్నిహితంగా ఉండేవాడని తేలింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె కుమార్తె తండ్రి మహేశ్ నాయక్‌కు చెప్పింది. దీనిపై కుటుంబంలో తీవ్ర కలహాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో కమలాకర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహేశ్ నాయక్ తన స్నేహితుడు వసంత్ నాయక్‌తో కలిసి వెళ్తుండగా, కమలాకర్ శిష్యులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలు కాగా, చికిత్స పొందుతూ వసంత్ నాయక్ మృతి చెందాడు.
ప్రాథమిక విచారణలో సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ, కమలాకర్ భట్‌తో పాటు మరికొందరు ఈ దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కమలాకర్‌ను అరెస్టు చేసి, మరో ఆరుగురిని విచారిస్తున్నట్లు సిద్ధాపుర పోలీసులు తెలిపారు.
ఇరవై ఏళ్ల క్రితం మహేశ్ నాయక్‌ను ప్రేమించి సుచిత్ర వివాహం చేసుకున్నట్లు, వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, కమలాకర్‌తో స్నేహమే దీనికి కారణమని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















