ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా గత ఐదు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగలేదు. గాయం నుంచి కోలుకుంటున్న హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టిపెట్టాడు. ఆదివారం రోహిత్ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతను కొట్టిన ఓ షాట్ ప్రమాదవశాత్తూ గ్రౌండ్‌స్టాఫ్‌లో ఒకరికి తగిలింది. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స అందించడానికి రోహిత్ పరుగెత్తాడు.
‘‘మైదానంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆఫ్-సైడ్ నెట్ తీసివేయమని రోహిత్ చెప్పారు. మేము నెట్‌ను తొలగించి పక్కన నిలబడ్డాం. సరిగ్గా అప్పుడే నేను పక్క ఉన్న ఆటగాళ్లను గమనించకుండా తీగను చుడుతుండగా రోహిత్ కొట్టిన బంతి నా ఎడమ మోకాలికి తగిలింది. ఆయన వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి నా గాయం గురించి అడిగారు. ఫర్వాలేదు బ్యాటింగ్ కొనసాగించమని నేను ఆయనతో చెప్పాను. అయినప్పటికీ, రోహిత్ ఒక ఐస్ ప్యాక్ తీసుకువచ్చారు. అంతేకాకుండా నా కాలికి రాసుకోవడానికి మందు, స్ప్రే తీసుకురమ్మని మరొకరిని పంపించారు’’ అని గాయపడిన గ్రౌండ్ సిబ్బంది బిశ్వాస్ తెలిపారు. జరిగిన దానికి హిట్‌మ్యాన్ క్షమాపణలు చెప్పాడని, నొప్పితో బాధపడుతున్నప్పటికీ రోహిత్‌తో కరచాలనం చేసే అవకాశం దొరకడం సంతోషంగా ఉందని బిశ్వాస్ పేర్కొన్నాడు.
ఏప్రిల్ 12న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కండరాల గాయంతో రోహిత్ మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో హిట్‌మ్యాన్ 165 స్ట్రైక్‌రేట్‌తో 137 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇవాళ వాంఖడేలో ముంబయి, లఖ్‌నవూ మ్యాచ్ జరగనుంది. ఇందులో రోహిత్ బరిలోకి దిగుతాడో?లేదో చూడాలి
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















