టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)పై ఈ ఐపీఎల్ సీజన్‌లో నిషేధం విధించాలని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వివాదానికి కారణమవగా, అదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ వీడియోలో అతడు ముంబయి ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మను ఉద్దేశిస్తూ ‘ఓయ్ అంధేరీ… సన్‌స్క్రీన్ లగాయా’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను కొందరు రంగు వివక్షగా భావిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అభిమానుల నుంచి కూడా అర్ష్‌దీప్‌పై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ వివాదంపై లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఎక్స్ (X) వేదికగా ఘాటుగా స్పందించారు. “నన్ను ఎవరూ నమ్మలేదు, అందరూ నన్ను ఎగతాళి చేసి ట్రోల్ చేశారు. అర్ష్‌దీప్‌ను ఈ సీజన్‌లో నిషేధించాలి. నన్ను మళ్లీ ట్రోల్ చేస్తారని నాకు తెలుసు” అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో తనపై జరిగిన రంగు వివక్ష వ్యాఖ్యల విషయాన్ని కూడా ప్రస్తావించారు.
ఒకవేళ బీసీసీఐ చర్యలు తీసుకుంటే, తనపై రంగు ఆధారంగా వ్యాఖ్యలు చేసిన వారి పేర్లను బయటపెడతానని కూడా శివరామకృష్ణన్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















