దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ చివరకు నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 96కు పడిపోవడం, అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం మార్కెట్లపై ప్రధాన ఒత్తిడిగా మారాయి. ఈ పరిణామాలతో లోహ, చమురు-గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ రంగాల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ.3 చొప్పున పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు మదుపర్లను మరింత కలవరపెట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 3 శాతం పెరిగి 109.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.26 లక్షల కోట్లు తగ్గి రూ.460.59 లక్షల కోట్లకు (సుమారు 4.8 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
సెన్సెక్స్ ఉదయం 99 పాయింట్ల లాభంతో 75,497.10 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 75,870.36 వద్ద గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీ నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 75,139.41 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ చివరకు 160.73 పాయింట్ల నష్టంతో 75,237.99 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 46.10 పాయింట్లు తగ్గి 23,643.50 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 16 షేర్లు నష్టాలను నమోదు చేశాయి. టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, బీఈఎల్, ఎల్ అండ్ టీ వంటి షేర్లు 0.8% నుంచి 2% మధ్య నష్టపోయాయి. మరోవైపు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, ఎయిర్‌టెల్ వంటి షేర్లు లాభాల్లో నిలిచాయి.
చమురు ధరల పెంపు ప్రభావంతో చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు కూడా ఒత్తిడికి లోనయ్యాయి. బీపీసీఎల్ 2.71%, హెచ్‌పీసీఎల్ 2.39%, ఐఓసీ 1.85% నష్టపోయాయి. అదే విధంగా రంగుల కంపెనీల షేర్లు కూడా డీలా పడ్డాయి. ఇండిగో పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్ స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















