కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో భావోద్వేగంగా స్పందించారు. కరీంనగర్‌లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రలో మాట్లాడుతూ, ‘‘నిజంగా నా కుమారుడు తప్పు చేస్తే వందశాతం శిక్ష పడాల్సిందే.. చట్టం ముందు అందరూ సమానమే’’ అని స్పష్టం చేశారు.
ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయానని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘150 రోజులు పాదయాత్ర చేసి ప్రజల కష్టనష్టాల్లో భాగమయ్యా. ప్రజలే నా కుటుంబమనుకున్నా. కానీ నా కుటుంబానికి, కుమారుడికి సమయం ఇవ్వకుండా పొరపాటు చేశా’’ అంటూ సమాజానికి క్షమాపణ చెప్పారు.
‘‘తప్పు చేయలేదు నాన్నా.. నిజాయతీగా బయటకొస్తా’’ అని తన కుమారుడు చెప్పాడని వెల్లడించిన బండి సంజయ్, అయినప్పటికీ ఎవరైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. తన బిడ్డకు ప్రత్యేక న్యాయం ఉండదని స్పష్టం చేశారు.కుటుంబంపై జరుగుతున్న విమర్శలు తన భార్యను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. ‘‘నా భార్య బ్యాంకు ఉద్యోగానికి సెలవు పెట్టి కార్యకర్తలకు సహాయం చేస్తోంది. ఇప్పుడు కుటుంబంపై జరుగుతున్న దాడులతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించిన బండి సంజయ్, తెలంగాణలో దళారుల వ్యవస్థ, కుటుంబ పాలన, అవినీతిని అంతమొందిస్తానని హెచ్చరించారు. ‘‘నాపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టను’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబాలను మళ్లీ కలుస్తానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణం సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ప్రారంభమైందని, ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















