న్యాయవాదిని కిడ్నాప్ చేసి బెదిరింపులతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు అరెస్టయ్యాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన వైకాపా నేత కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు అరెస్టు చేసి గురువారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 24 వరకు రిమాండ్ విధించింది.
ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుండటంతో బాధిత న్యాయవాది హరిబాబు కోర్టును ఆశ్రయించగా, విచారణ వేగవంతం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
విజయవాడ రామచంద్రనగర్‌కు చెందిన న్యాయవాది హరిబాబు వద్ద నుంచి కర్నాటి వీరభద్రరావు, అతని కుమారుడు సతీష్ కలిసి రూ.2.40 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అందులో రూ.1.40 కోట్లు తిరిగి చెల్లించినప్పటికీ మిగిలిన రూ.1 కోటి చెల్లించకుండా తప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఆ సమయంలో గురజాల డీఎస్పీగా పనిచేసిన పల్లంరాజు సహకారంతో హరిబాబుపై పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు. అనంతరం పోలీసుల సాయంతో హరిబాబును కిడ్నాప్ చేసి పిడుగురాళ్లకు తీసుకెళ్లారు. అక్కడ బెదిరింపులకు గురిచేసి తర్వాత విజయవాడకు తీసుకొచ్చి, రెండు ఎకరాల పొలం మరియు నగరంలోని త్రీ బెడ్రూం ఫ్లాట్‌ను నున్నలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరభద్రరావు పేరుతో బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయంలో హరిబాబు వద్ద ఉన్న బ్యాంకు లాకర్ నుంచి రూ.20 లక్షలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అదనంగా బంధువుల ద్వారా మరో రూ.10 లక్షలు కూడా తెప్పించుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో పోలీసుల కళ్లుగప్పి హరిబాబు తన ఫోన్ ద్వారా అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు విజయవాడ పటమట పోలీసులు ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేసి సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హరిబాబును తీసుకుని విచారణ జరిపి విడుదల చేశారు.
ఈ కేసులో ఏ2గా అప్పటి గురజాల డీఎస్పీ పల్లంరాజు, ఏ3గా పిడుగురాళ్ల ఎస్సై రబ్బానీ, అలాగే కానిస్టేబుళ్లు వెంకటేశ్వరరావు, బాలునాయక్, నాగూర్ వలీతో పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కర్నాటి సతీష్ నిందితులుగా ఉన్నారు. వీరిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews





















