తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల బలోపేతానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు నగరపాలక సంస్థల పరిధిలోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డులకు ఓటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట వీల్‌చైర్ సౌకర్యం కూడా కల్పించారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల వద్ద అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టింది.
పోలింగ్ ముగిసిన అనంతరం ఈ నెల 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఫలితాల ఆధారంగా 16న నగరపాలక సంస్థల మేయర్లు, ఉపమేయర్లు, మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలు స్థానిక పాలనలో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















