తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల (ఎన్‌హెచ్-63), జగిత్యాల–కరీంనగర్ (ఎన్‌హెచ్-563) జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధాని Narendra Modi అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుమారు రూ.7,597.16 కోట్ల అంచనా వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టనుండగా, ఎన్‌హెచ్-63ను హ్యామ్ విధానంలో, ఎన్‌హెచ్-563ను బీవోటీ విధానంలో నిర్మించనున్నారు.
ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలను అనుసంధానించనుండగా, కోరుట్ల, ధర్మపురి, లక్షెట్టిపేట వంటి ప్రధాన ప్రాంతాలకు మెరుగైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే జగిత్యాల–కరీంనగర్ మార్గంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లు నిర్మించనున్నారు.
గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ హైవేలను రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు ప్రయాణ సమయం సుమారు గంటన్నర మేర తగ్గనుండగా, జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు 45 నిమిషాల సమయం ఆదా కానుంది.
పీఎం గతిశక్తి పథకం కింద అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా 5 ఆర్థిక కేంద్రాలు, 7 సామాజిక కేంద్రాలు, 8 లాజిస్టిక్ హబ్‌లు పరస్పరం అనుసంధానమవుతాయి. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలకు రాకపోకలు కూడా మరింత సులభం కానున్నాయి.
ఇదిలా ఉండగా రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినప్పటికీ, ఈ సమావేశంలో ఆ ప్రాజెక్టుకు ఆమోదం లభించలేదు. త్వరలో జరిగే తదుపరి సమావేశంలో ఆర్ఆర్ఆర్కు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















