చాలా సంవత్సరాల క్రితం తక్షశిలలో చాణక్యుడు అనే గొప్ప బ్రాహ్మణ పండితుడు నివసించేవాడు. ఆయన అసాధారణమైన మేధస్సు, రాజకీయ చతురత, దూరదృష్టితో ప్రసిద్ధి పొందారు. భారత చరిత్రలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాల్లో ఒకటైన మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్యుని పాత్ర అత్యంత కీలకమైనది. చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా నిలబెట్టేందుకు ఆయన ఎన్నో కష్టాలు, అవమానాలు, పోరాటాలు ఎదుర్కొన్నారు.
ఒకసారి నందుల రాజ్యాన్ని ఓడించాలనే లక్ష్యంతో చాణక్యుడు, చంద్రగుప్తుడు కలిసి పాటలీపుత్ర నగరంపై నేరుగా దాడి చేశారు. అయితే నందుల బలమైన సైన్యం ముందు వారు ఓటమి పాలయ్యారు. ఆ పరాజయంతో చాణక్యుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆలోచనల్లో మునిగిపోయి ఇంటికి వెళ్తుండగా అలసటతో ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు.
ఆ ఇంట్లో ఒక వృద్ధురాలు తన మనవళ్లకు వేడివేడిగా అన్నం వడ్డిస్తోంది. పిల్లల్లో ఒకడు అన్నం మధ్యలో చేతి పెట్టి తినబోయి వేడికి చేయి కాల్చుకున్నాడు. వెంటనే కేక వేయడంతో ఆ వృద్ధురాలు, “ఎందుకు అలా చేశావు? అన్నం మధ్యలో కాకుండా పక్కల నుంచి కొంచెం కొంచెంగా తింటే చల్లారుతుంది కదా!” అని చెప్పింది.
అంతటితో ఆగకుండా, “నువ్వు కూడా చాణక్యుడిలా చేశావు. అతడూ నందుల బలమైన రాజధానిపైనే నేరుగా దాడి చేసి ఓడిపోయాడు” అని అనింది.
ఈ మాటలు విన్న చాణక్యుడు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. తన వ్యూహంలో జరిగిన పొరపాటు అర్థమైంది. శత్రువు అత్యంత బలంగా ఉన్న ప్రాంతాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకోవడం కంటే, ముందుగా చుట్టుపక్కల చిన్న రాజ్యాలను జయించి శక్తిని పెంచుకోవాలని గ్రహించాడు.
ఆ తర్వాత చంద్రగుప్తుడితో కలిసి చాణక్యుడు కొత్త వ్యూహాన్ని అమలు చేశాడు. చిన్న చిన్న రాజ్యాలను ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ నందుల రాజ్యాన్ని చుట్టుముట్టాడు. చివరకు సరైన సమయంలో పాటలీపుత్రపై దాడి చేసి విజయం సాధించాడు. ఆ విజయంతో మౌర్య సామ్రాజ్యం ఆవిర్భవించింది.
ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఏ పెద్ద లక్ష్యాన్నైనా ఒక్కసారిగా సాధించలేం. సహనం, సరైన ప్రణాళిక, దశలవారీ కృషి ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. చిన్న విజయాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. చాణక్యుడు నేర్చుకున్న ఈ పాఠం భారతదేశ చరిత్రను మార్చడమే కాకుండా, నేటికీ నాయకత్వం మరియు వ్యూహాత్మక ఆలోచనలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















