ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 22న నిర్వహించనున్న ‘అలయ్-బలయ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చంద్రబాబును ఆహ్వానించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ‘అలయ్-బలయ్’ ప్రతీకగా నిలుస్తోందని దత్తాత్రేయ తెలిపారు. రాజకీయాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలకు అతీతంగా ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి స్నేహం, సోదరభావం, ఐక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
తన ఆహ్వానాన్ని చంద్రబాబు సాదరంగా స్వీకరించారని, కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారని దత్తాత్రేయ తెలిపారు. ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, తెలుగు ప్రజల ఐక్యత, పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















