తెలంగాణకు చెందిన బీటెక్ విద్యార్థి మణిదీప్ రెడ్డి ఫిన్‌లాండ్‌లో అదృశ్యమై 45 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురంలోని వైదేహి నగర్‌కు చెందిన మణిదీప్ రెడ్డి ఉన్నత విద్య కోసం ఫిన్‌లాండ్ వెళ్లి లాతి పట్టణంలోని ఎల్‌యూటీ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
గత నెల 4వ తేదీన తల్లితో చివరిసారిగా మాట్లాడిన మణిదీప్, మే 5వ తేదీ నుంచి ఫోన్‌కు స్పందించకపోవడంతో కుటుంబంలో ఆందోళన మొదలైంది. వెంటనే స్నేహితులు, పరిచయస్తులను కాలేజీ, రూమ్ ప్రాంతాలకు పంపించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఫిన్‌లాండ్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయినా ఇప్పటివరకు విద్యార్థి ఆచూకీ దొరకలేదు.
45 రోజులుగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఫిన్‌లాండ్ అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదే సమయంలో హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఫిన్‌లాండ్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థి అదృశ్యంపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం, ఫిన్‌లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ పోలీసులు సహా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మణిదీప్ మే 5న తల్లితో మాట్లాడిన తర్వాత ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. తదుపరి వివరాలు సమర్పించాలని ఆదేశించిన న్యాయమూర్తి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















