తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన హిందీ వివాదం, నీట్ విధానం, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి పలు అంశాలను ప్రస్తావిస్తూ విపక్షాల విమర్శలకు గట్టిగా సమాధానం ఇచ్చారు.
తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలను ప్రస్తావించిన సీఎం విజయ్, తాము అధికారంలోకి రావడం అంత సులభం కాలేదని అన్నారు. ‘‘మాది యాక్టర్ పార్టీ అని, నేను సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నానని కొందరు గేలి చేశారు. కానీ ఆ విమర్శలను నేను పట్టించుకోను. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం కోసం ఎన్నో సవాళ్లు, కుట్రలను ఎదుర్కొన్నాం. నేను ముందుగా ప్రజల్లోకి వెళ్లి, ఆ తర్వాతే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశా. ప్రజలే మమ్మల్ని గెలిపించారు’’ అని పేర్కొన్నారు.
నీట్ విధానం విద్యా రంగంలో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని విమర్శించిన సీఎం, దానిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ద్విభాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం హిందీని రుద్దే ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమని ఆయన తెలిపారు.
కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ సీఎం భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన నన్ను తీవ్రంగా బాధించింది. ఆ వేదన ఎప్పటికీ మర్చిపోలేను. కానీ ఆ ఘటనలోనూ మాపైనే నిందలు మోపడం బాధాకరం. రాజకీయాలు ఇంత క్రూరమా?’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే వారసత్వ రాజకీయాలపై పరోక్షంగా డీఎంకేపై విమర్శలు గుప్పించిన ఆయన, ‘‘ఒక కుటుంబానికే ప్రాధాన్యం ఇవ్వడం మా విధానం కాదు. తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవ చేయడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















