చైనా తన కొత్త, అత్యంత శక్తివంతమైన విమానవాహక నౌక ఫుజియాన్‌ను మంగళవారం తైవాన్ జలసంధిలోకి పంపినట్లు సమాచారం. తైవాన్ ఐదు రోజుల యుద్ధవిన్యాసాలను ప్రారంభించిన మరుసటి రోజే ఈ చర్య చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
చైనా నావికాదళంలో ప్రస్తుతం మూడు విమానవాహక నౌకలు ఉండగా, వాటిలో ఫుజియాన్ అత్యాధునికంగా, సాంకేతికంగా అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తున్నారు. తైవాన్ జలసంధి చైనా భూభాగం మరియు తైవాన్ దీవి మధ్య ఉన్న సన్నని సముద్ర మార్గం.
తైవాన్ ప్రస్తుతం స్వయంపాలనలో ఉన్నప్పటికీ, దానిని తమ భూభాగంగా చైనా (డ్రాగన్) ప్రకటిస్తోంది. అవసరమైతే బలప్రయోగం ద్వారా తైవాన్‌ను తన నియంత్రణలోకి తీసుకుంటామని కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా తరచూ తైవాన్ సమీపంలో యుద్ధ విమానాలు, నౌకలను పంపుతూ సైనిక ఒత్తిడిని పెంచుతోంది.
దీనికి ప్రతిస్పందనగా తైవాన్ కూడా చైనా దాడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు క్రమం తప్పకుండా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇరు పక్షాల మధ్య ఈ చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















