తాత్కాలిక అవగాహన ఒప్పందం తర్వాత హర్మూజ్ జలసంధి గుండా భారత్‌కు రాకపోకలు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 17న అమెరికా, ఇరాన్ దేశాలు ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం ఇప్పటివరకు 11 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తున్నాయని వివరించింది.
వాటిలో మూడు నౌకలు భారత పతాకంతో నడుస్తున్న ముడిచమురు ట్యాంకర్లు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఈ నౌకలు ప్రస్తుతం భారత తీరాలకు చేరువవుతున్నాయని, సరఫరా వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గంగా భావించే హర్మూజ్ జలసంధి పరిసరాల్లో తాజా పరిణామాలు అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌కు వచ్చే ముడిచమురు సరఫరా సాఫీగా కొనసాగుతుందా అనే అంశంపై కూడా దృష్టి కేంద్రీకృతమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















