రాష్ట్రంలో మెరుగైన పాలన అందించేందుకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో ఫైళ్ల క్లియరెన్స్, ఈ-ఆఫీస్, డేటా లేక్ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో ఫైళ్ల క్లియరెన్స్ కీలకమని పేర్కొన్న సీఎం, సీఎస్ నుంచి మండల స్థాయి వరకు అధికారులు ఈ-ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు. మ్యానువల్ ఫైళ్లను దాదాపు పూర్తిగా తొలగించి, ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందాలంటే ఫైళ్లను వేగంగా క్లియర్ చేయడం అవసరమని చంద్రబాబు తెలిపారు. 24 గంటల్లోపు ఈ-ఫైళ్లు డిస్పోజ్ అయ్యేలా మంత్రులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. జిల్లాల్లో ఇంకా ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించని ఫైళ్లు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు.
ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా పనిచేస్తున్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలను సీఎం అభినందించారు. భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సగటున 10 గంటల్లోనే వాటిని పరిష్కరించిన సీఎస్ సాయి ప్రసాద్‌కు ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

















