రాష్ట్రంలో పెరుగుతున్న భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు మరిన్ని ఐపీఎస్ అధికారులను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి బుధవారం దిల్లీలో అమిత్‌షాతో సమావేశమైన సీఎం పలు కీలక అంశాలపై చర్చించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో మొదటిసారి ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన తదుపరి రివ్యూ ఆలస్యంగా 2025లో నిర్వహించారని ఆయన తెలిపారు. ఆ సమయంలో కూడా తెలంగాణకు కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులనే కేటాయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 83 మంది ఐపీఎస్ అధికారులు మాత్రమే ఉన్నారని, ఈ సంఖ్యను కనీసం 105కు పెంచాలని కేంద్రాన్ని కోరారు.
ప్రత్యేకంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి అదనపు ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. రాజధాని పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించడంతో పాటు కొత్తగా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా సీఎం వివరించారు. ముఖ్యంగా డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’, అలాగే సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న కీలక పాత్ర గురించి అమిత్‌షాకు వివరించారు.
అదే సమయంలో మావోయిస్టు కార్యకలాపాల పరిస్థితిపై కూడా చర్చ జరిగింది. గత రెండేళ్లలో రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో చేరారని సీఎం తెలిపారు. ఇటీవల అనేక మంది మావోయిస్టు నాయకులు సాధారణ జీవితాన్ని ఎంచుకోవడం శుభపరిణామమని పేర్కొన్నారు. లొంగుబాట్లు, పునరావాస కార్యక్రమాల ద్వారా వారికి అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నామని వివరించారు.
అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డీజీపీ శివధర్‌రెడ్డి, నిఘా విభాగాధిపతి విజయ్‌కుమార్, ఎస్సైబీ ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics governance Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow



















