గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజులపాటు సాగిన ఈ క్రీడా సంబరాల్లో ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లు తమ ప్రతిభను చాటుకున్నారు. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 171 పతకాలతో అగ్రస్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ 110, కెనడా 62 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 39 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.
ముగింపు వేడుకల అనంతరం 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు భారత్‌కు బదిలీ అయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్ బాటన్‌ను భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా, గుజరాత్ ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వితో కలిసి భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వీకరించారు. దీంతో తదుపరి కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ అధికారికంగా బాధ్యతలు అందుకుంది.
ముగింపు వేడుకల్లో భారత్, స్కాట్లాండ్ సంస్కృతుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘వసుదైక కుటుంబం’ సందేశంతో వేడుకలు కొనసాగగా.. ‘వందే మాతరం’ నినాదాలతో స్టేడియం మార్మోగింది. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, మానుషి ఛిల్లార్ ప్రదర్శనలు అలరించాయి.
2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్ ప్రత్యేకతలను చాటిచెప్పే లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. గుజరాత్ వారసత్వం, ఆధునికత, ఆవిష్కరణలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ ప్రదర్శనతో గ్లాస్గో నుంచి అహ్మదాబాద్ వైపు కామన్వెల్త్ క్రీడా ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















