దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను ఈస్ట్ జోన్ సొంతం చేసుకుంది. చెపాక్ స్టేడియం వేదికగా సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన ఆధిక్యం ఈస్ట్ జోన్‌కు కలిసొచ్చింది. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆ జట్టు మరోసారి దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ భారీగా 708 పరుగులు సాధించింది. అనంతరం సౌత్ జోన్ 336 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ జోన్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది.
ఐదో రోజు ఆటను 212/5తో ప్రారంభించిన ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్.. చివరకు 388/7 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. మరోవైపు 26 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన కౌనైన్ ఖురేషి అజేయ శతకం సాధించాడు. మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు.
అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా దులీప్ ట్రోఫీ ఈస్ట్ జోన్ ఖాతాలో చేరింది. టైటిల్ విజయం అనంతరం ఆటగాళ్లు మైదానంలో సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ చేస్తూ సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















