మహారాష్ట్రలోని పుణె జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష విధిస్తూ పుణె ఫాస్ట్-ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయస్థానం, శిక్షలో ఎలాంటి సడలింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. 2026 మే 1న జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీసింది.
నస్రాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు భీమ్‌రావ్, చిన్నారిని దూడను చూపిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతంలోని పశువుల షెడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి అనంతరం బండ రాయితో కొట్టి హత్య చేసినట్లు కోర్టు విచారణలో తేలింది.
చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, పశువుల షెడ్డులో మృతదేహం లభ్యమైంది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ కేసును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ అనంతరం పుణె ఫాస్ట్-ట్రాక్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















