మూసీ నది అభివృద్ధి పనుల్లో కీలక మైలురాయి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణశాఖ 83 ఎకరాల భూములు కేటాయించేందుకు అంగీకరించింది. వర్కింగ్ పర్మిషన్ జారీ చేస్తూ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి Revanth Reddy సంతోషం వ్యక్తం చేశారు. రక్షణశాఖ మంత్రి Rajnath Singhతో పాటు సైన్యాధికారులకు ‘ఎక్స్’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ఇది కీలక మైలురాయి అని పేర్కొన్నారు. నదిని నిరంతర మంచినీటి ప్రవాహంతో పునరుజ్జీవింపజేసి, దాన్ని ఆర్థిక, పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
మొదటి దశ మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు ప్రధాన భాగంగా ఉంది. బాపూఘాట్ త్రివేణి సంగమం వద్ద 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రైవేటు భూములతో పాటు గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌కు చెందిన భూములు అవసరమయ్యాయి. ఈ భూసేకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు రక్షణశాఖతో చర్చలు జరిపారు.
మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) ప్రతిపాదనల మేరకు రక్షణశాఖ అధికారులు ఈ ఏడాది మార్చిలోనే భూముల పరిశీలన చేపట్టారు. అనంతరం 83.814 ఎకరాలు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఇవి గండిపేట, రాజేంద్రనగర్, గోల్కొండ మండలాల పరిధిలో నాలుగు భాగాలుగా విస్తరించి ఉన్నాయి. ఈ భూముల విలువ సుమారు రూ.533 కోట్లకు పైగా అని అంచనా వేశారు.
ఈ భూముల బదలాయింపు సమాన విలువ గల మౌలిక సౌకర్యాల (EVI) విధానంలో జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఆ విలువకు సమానంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే భూసర్వేకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. 15–20 రోజుల్లో ఉమ్మడి సర్వే పూర్తి చేసి ఎంఓయూ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. 1948లో మహాత్మా గాంధీ అస్థికలను దేశంలోని 12 నదీ సంగమాల్లో కలిపారు. వాటిలో హైదరాబాద్‌లోని బాపూఘాట్ కూడా ఒకటి. ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి గాంధీ సరోవర్‌గా రూపుదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రాజెక్టులో భాగంగా 100 మీటర్ల ఎత్తయిన టవర్, దాని పైభాగంలో 30 మీటర్ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎడ్యుకేషన్ హబ్, ధ్యాన మందిరం, మ్యూజియం, పబ్లిక్ రిక్రియేషన్ స్పేసెస్, గాంధీ యూనివర్సిటీ, చేనేత శిక్షణ కేంద్రం వంటి విభాగాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం మిగిలిన ప్రైవేటు భూముల సేకరణ కొనసాగుతోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















