దక్షిణ దిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసి.. ఆ నేరాన్ని దొంగలపైకి నెట్టేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
ఈ నెల 10న దక్షిణ దిల్లీలో రోడ్డుపై ఓ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడిని రియల్ ఎస్టేట్ ఏజెంటు మున్నాలాల్ (55)గా గుర్తించారు. ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలు కనిపించాయి.
మున్నాలాల్ భార్య మంజు అలియాస్ నాజియా (45) పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. ఇంట్లోకి దొంగలు చొరబడి, వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భర్తను హత్య చేశారని తెలిపింది. అయితే ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆమె వాంగ్మూలంపై అనుమానం వ్యక్తం చేశారు.
ఫుటేజీలో ముసుగు ధరించిన ఓ వ్యక్తి రాత్రి 1.45 గంటలకు ఇంట్లోకి ప్రవేశించి.. తెల్లవారుజామున 3.15 గంటలకు బయటకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నాజియాను పోలీసులు మరింత లోతుగా విచారించగా.. చివరకు నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తాగునీటిలో మత్తుమందు కలిపి మున్నాలాల్‌కు ఇచ్చారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత తాడుతో గొంతు నులిమి, విద్యుత్ షాకులు ఇచ్చి, కర్రతో కొట్టి హత్య చేసినట్లు నాజియా వెల్లడించింది.
భర్తను హత్య చేస్తే తన ప్రియుడు చమన్ (20)కు రూ.5 లక్షలు ఇస్తానని నాజియా హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం అతడికి రూ.20 వేలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో కిషన్ (28) అనే మరో వ్యక్తి కూడా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.
మున్నాలాల్, నాజియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కేసులో నాజియా, చమన్, కిషన్‌ను అరెస్టు చేసినట్లు డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















