టీ20 ప్రపంచకప్ 2026ను టీమ్ ఇండియా ఘనంగా కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై మాజీ, ప్రస్తుత క్రికెటర్లు భారత జట్టుకు అభినందనలు తెలుపుతున్నారు.
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ స్పందించాడు. గంభీర్ ముఖంపై చిరునవ్వు ఎంతో ప్రత్యేకమని, విజయం సాధించాలనే పట్టుదలతో పాటు ఆ చిరునవ్వు ఒక కిల్లర్ కాంబినేషన్‌లా పనిచేస్తుందని అన్నాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రాను అసలైన ఛాంపియన్ బౌలర్‌గా అభివర్ణిస్తూ, అతని ప్రతిభను ఒక్క పదంలో చెప్పలేమని పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాట్లాడుతూ, టీ20 ఫార్మాట్‌లో 25 నుంచి 30 పరుగుల తేడాతో గెలిచినా అది పెద్ద విజయంగా భావిస్తామని, కానీ ఈసారి భారత్ సాధించిన విజయం మరింత గొప్పదని అన్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ టీ20 ఫార్మాట్‌లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టు ఇదే మొదటిసారని, ఈ ఘనతకు భారత క్రికెటర్లు పూర్తిగా అర్హులని అన్నారు. క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శనకు టీమ్ ఇండియా ఎప్పటికీ ఒక బ్రాండ్‌గా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టును అభినందిస్తూ ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడాడని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో భారత జట్టు అసాధారణ ఆటతీరుతో విజయం సాధించిందని అన్నారు. టోర్నమెంట్ మొత్తం ఒత్తిడిని అధిగమిస్తూ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించారని, సంజు అత్యుత్తమ ప్రదర్శన చేశాడని పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన మేనేజ్‌మెంట్, సపోర్ట్ స్టాఫ్ అందరికీ అభినందనలు తెలిపారు.
మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందిస్తూ, ఆదివారం మ్యాచ్‌ను మన అబ్బాయిలు గల్లీ క్రికెట్ ఆడినంత సులువుగా ముగించారని అన్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ మూడోసారి విజయం సాధించడం గొప్ప ఘనత అని చెప్పారు.వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ విజయం జట్టులోని నమ్మకం, వ్యక్తిత్వం, సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కీలక సందర్భాల్లో ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్న తీరు ప్రత్యేకమని అన్నారు. ఇలాంటి విజయాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తాయని అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















