వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటాడు. ఎండ తీవ్రతకు శరీరం త్వరగా అలసిపోవడం, నీరసం రావడం సహజం. ఇలాంటి సమయంలో శరీరానికి శక్తినిస్తూ, చల్లబరిచే పండ్లలో పుచ్చకాయ కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్య పరంగా కూడా పుచ్చకాయ ఒక అద్భుతమైన ఫలం.
1. డీహైడ్రేషన్‌కు అడ్డుకట్ట
పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. వేసవిలో చెమట ద్వారా శరీరం కోల్పోయే నీటిని తిరిగి భర్తీ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.
2. గుండెకు రక్షణ
పుచ్చకాయలో లైకోపీన్ (Lycopene) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, రక్తపోటును (Blood Pressure) నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
3. చర్మం మెరిసిపోతుంది
ఎండ వల్ల చర్మం నల్లబడటం (Suntan) లేదా ముడతలు పడటం వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయలోని విటమిన్-ఎ మరియు సి చర్మాన్ని తేమగా ఉంచి, మెరుపును ఇస్తాయి. దీనిలోని నీటి శాతం చర్మాన్ని లోపల నుండి శుభ్రపరుస్తుంది.
4. కండరాల నొప్పుల నుండి ఉపశమనం
ఎండలో ఎక్కువగా తిరగడం లేదా వ్యాయామం చేయడం వల్ల కండరాలు పడటం లేదా నొప్పులు రావడం జరుగుతుంది. పుచ్చకాయలో ఉండే ‘ఎల్-సిట్రులైన్’ (L-citrulline) అనే అమైనో యాసిడ్ కండరాల నొప్పులను తగ్గించి, త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.
5. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
పుచ్చకాయలో నీటితో పాటు పీచు పదార్థం (Fiber) కూడా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేసవిలో వచ్చే పొట్ట సంబంధిత సమస్యలకు ఇది మంచి పరిష్కారం.
6. బరువు తగ్గాలనుకునే వారికి వరం
తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీరు ఉండటం వల్ల పుచ్చకాయ తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇది అతిగా ఆహారం తీసుకోకుండా నిరోధిస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















