గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ పి. విజయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. లలితా పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరోసైన్సెస్ విభాగాధిపతిగా, అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న ఆమె వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్‌వో) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వైద్య రంగంలో పనిచేస్తున్న 95 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది సభ్యులు డబ్ల్యూఎస్‌వో బోర్డుకు 18 మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో డాక్టర్ పి. విజయకు కూడా అవకాశం లభించింది. ఎన్నిక ద్వారా ఈ పదవిని సాధించిన తెలుగు రాష్ట్రాలకు చెందిన తొలి వైద్య నిపుణురాలిగా ఆమె గుర్తింపు పొందారు.
మెదడు పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలు, పరిశోధనలు, రోగుల్లో అవగాహన పెంపొందించడం, ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో డాక్టర్ విజయ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ బాధ్యత లభించింది.
డబ్ల్యూఎస్‌వో డైరెక్టర్‌గా డాక్టర్ విజయ ఆసియా-ఓషియానియా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆమె నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ చికిత్స విధానాల అభివృద్ధి, ఆధునిక వైద్య మార్గదర్శకాల రూపకల్పన, వైద్య విద్యా కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నారు.
అలాగే వివిధ దేశాలకు చెందిన స్ట్రోక్ నిపుణులు, జాతీయ స్థాయి స్ట్రోక్ సంఘాల మధ్య సమన్వయం పెంచడం, ప్రజల్లో స్ట్రోక్ లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు.
డాక్టర్ పి. విజయ వైద్య రంగంలో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తూ స్ట్రోక్ బాధితులకు మెరుగైన చికిత్స అందించడంపై దృష్టి సారించారు. అత్యాధునిక చికిత్స విధానాలను అందుబాటులోకి తీసుకురావడం, వైద్య పరిశోధనలను ప్రోత్సహించడం, యువ వైద్యులకు శిక్షణ ఇవ్వడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి సంస్థలో బాధ్యత పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం ద్వారా స్ట్రోక్ చికిత్స రంగంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అవకాశం లభించిందని చెప్పారు.
గుంటూరుకు చెందిన వైద్యురాలు అంతర్జాతీయ వైద్య సంస్థలో కీలక పదవి చేపట్టడం పట్ల వైద్య వర్గాలు, నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ విజయ సాధించిన ఈ ఘనత రాష్ట్ర వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందని పలువురు అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















