వరకట్న వేధింపులు, భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జఫర్‌గఢ్‌కు చెందిన కోల సోని(28)కి సముద్రాల గ్రామానికి చెందిన తాడెం అనిల్(35)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో సోని కుటుంబం ఆరు తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, 100 గజాల స్థలాన్ని వరకట్నంగా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే కొంతకాలంగా అనిల్ అదనపు కట్నం కోసం సోనిని వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో ఇచ్చిన బంగారాన్ని సైతం అనిల్ తన అవసరాల కోసం విక్రయించినట్లు తెలిపారు. మరోవైపు అతడు మరో మహిళతో సంబంధం కొనసాగిస్తూ సోనిని మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుమారు 15 రోజుల క్రితం అదనపు కట్నం తీసుకురావాలంటూ సోనిపై ఒత్తిడి పెంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన సోని శనివారం పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతిచెందారు.
మృతురాలి తండ్రి ప్రతాప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్ సీఐ జి.వేణు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















