దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం సానుకూల ధోరణితో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూన్ త్రైమాసికంలో నమోదైన మెరుగైన కంపెనీల ఫలితాలు, ముడి చమురు ధరల్లో స్థిరత్వం, రూపాయి మారక విలువలో పెద్దగా మార్పులు లేకపోవడం, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలవొచ్చని చెబుతున్నారు.
అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, చమురు ధరల్లో మార్పులు దేశీయ సూచీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మదుపర్లు దేశీయ పరిణామాలతో పాటు అంతర్జాతీయ సంకేతాలను కూడా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
నిఫ్టీకి కీలక స్థాయిలు:
నిఫ్టీ-50కి 24,750–24,780 స్థాయిని కీలక నిరోధంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ స్థాయిని అధిగమిస్తే 24,900, ఆ తర్వాత 25,050 దిశగా సూచీ కదిలే అవకాశం ఉందని అంచనా. మరోవైపు 24,500–24,480 స్థాయిల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చని చెబుతున్నారు.
వాహన రంగం:
ఇటీవల స్థిరీకరణ దశ నుంచి బయటపడిన వాహన రంగ సూచీ సానుకూల ధోరణిని కొనసాగించే అవకాశం ఉంది. 28,600–28,900 స్థాయిలు మద్దతుగా, 30,600–31,000 స్థాయిలు నిరోధంగా ఉండొచ్చని అంచనా.
బ్యాంకింగ్:
దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం, ప్రముఖ బ్యాంకుల బలమైన త్రైమాసిక ఫలితాలు ఈ రంగానికి అనుకూలంగా మారాయి. నిఫ్టీ బ్యాంక్ సానుకూలంగా కదిలే అవకాశం ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో స్వల్ప ఒడిదుడుకులు ఉండొచ్చు.
ఫార్మా:
రక్షణాత్మక రంగంగా పేరున్న ఫార్మా షేర్లకు ఈ వారం మద్దతు లభించే అవకాశం ఉంది. జూన్ త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం ఈ రంగానికి సానుకూల అంశంగా మారొచ్చు.
ఐటీ:
అంతర్జాతీయ ఏఐ పరిణామాలు, విదేశీ మార్కెట్ల కదలికల కారణంగా ఐటీ షేర్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇటీవల నష్టాల కారణంగా కొన్ని నాణ్యమైన షేర్లలో ‘వేల్యూ బైయింగ్’ కనిపించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
లోహాలు, సిమెంట్:
లోహాల సూచీలో సాంకేతికంగా మరింత పెరుగుదలకు అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వర్షాలు, ముడి పదార్థాల వ్యయాలు సిమెంట్ కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. అయినప్పటికీ కొన్ని కంపెనీల షేర్లు మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంది.
టెలికాం, ఎఫ్‌ఎంసీజీ:
టెలికాం షేర్లు సమీప కాలంలో స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. కంపెనీల ఆర్థిక ఫలితాలు, పునరుజ్జీవన ప్రణాళికలపై యాజమాన్య వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి. బలహీన ఫలితాలు ప్రకటించిన కొన్ని ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉండగా, మెరుగైన ఫలితాలు సాధించిన కంపెనీలకు మద్దతు లభించొచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















